100%లవ్ : అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య , తమన్నా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “100%లవ్”మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో తమన్నా మహాలక్ష్మి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. ఈ మూవీ ని సుకుమార్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రచ్చ : మేఘా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రామ్ చరణ్ , తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “రచ్చ” మూవీ ఘనవిజయం సాధించింది. తమన్నా తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి “గ్యాంగ్ లీడర్ “మూవీ లోని “వానా వానా “సాంగ్ ను రీమిక్స్ చేయడం విశేషం.
బాహుబలి :ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , తమన్నా , అనుష్క ప్రధానపాత్రలలో రూపొందిన ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ “బాహుబలి -ది బిగింగ్ “మూవీ ఘనవిజయం సాధించింది. కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందిన ఈ మూవీ లో తమన్నా రెబెల్ వారియర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
బాహుబలి 2: రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన “బాహుబలి 2- ది కంక్లూజన్ “మూవీ ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తమన్నా రెబెల్ వారియర్ గా మహేంద్ర బాహుబలి కి సపోర్ట్ చేసే పాత్ర లో నటించి ప్రేక్షకులను అలరించారు.
F 2 : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , తమన్నా జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ F 2 ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భర్తను ఇబ్బందులు , ఫ్రస్టేషన్ కు గురి చేసే భార్య పాత్రలో తమన్నా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సైరా నరసింహారెడ్డి: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , నయనతార , తమన్నా ప్రధాన పాత్రలలో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “సైరా నరసింహారెడ్డి “మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నరసింహ రెడ్డి ప్రేమించిన యువతి గా , అతని పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే నర్తకిగా ,
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనితగా తమన్నా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
[totalpoll id=”51543”]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: