ప్రస్తుతం సంపత్ నంది హీరో గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సంవత్సరంలో మొదలయిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కథతో రానున్నాడు సంపత్ నంది. అయితే ఈ సారి డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ తో రానున్నట్టు తెలుస్తుంది. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈసినిమాను నిర్మించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాని ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఇక ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ “మా బ్యానర్‌లో ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు సంపత్‌నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ ఫస్ట్‌వీక్ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. సంపత్‌నంది అసోసియేట్ డైరెక్టర్ అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించి ప్రముఖ నటీనటుల ఎంపిక జరుగుతుంది. అనూప్ క్రియేటివ్స్ సంగీతం అందిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: