ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా రిస్క్ అని చెప్పి షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు టాలీవుడ్ సెలబ్రిటీస్. ఏదో ఒకటి రెండు సినిమాలు మాత్రం షూటింగ్ జరుపుకున్నాయి. అయితే షూటింగ్ లకు వెళ్లకపోయినా కూడా సెలెబ్రిటీస్ మాత్రం కరోనా బారిన పడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించిన పలువురు నటులు, సింగర్స్, దర్శకులు కరోనా బారిన పడగా తాజాగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసి తెలిపారు.
‘గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిందని.. ప్రస్తుతం తాను చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు. మీ అందరి ఆశీస్సులతో అతి త్వరలోనే కోలుకుంటున్నాని పేర్కొన్నారు. ఈ సమయంలో విశ్రాంతి అవసరమని డాక్టర్స్ సూచించారు. దయచేసి ఎవరు కాల్స్ చేయవద్దు అంటూ వీడియోలో తెలిపారు.’
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: