కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉంది. కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మా తో మరికొంతమంది ని ఈ వ్యాధి నుండి రక్షించవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపై హీరో నాగచైతన్య స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కరోనా బాధితులలో ఆత్మ స్థైర్యం నింపేందుకు హైదరాబాద్ కొవిడ్ -19 హెల్త్ అడ్వకసీ గ్రూప్ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. శేఖర్ కమ్ముల హీరో నాగచైతన్య ను నామినేట్ చేశారు. హీరో నాగచైతన్య ఫేస్ బుక్ వేదికగా కరోనా వ్యాధి ని జయించిన నర్స్ సునీత తో మాట్లాడి , ఆమె అనుభవాలు తెలుసుకున్నారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలలో నెలకొన్న అపోహలు తొలగాలని , కరోనా బాధితులు భయాందోళనలకు గురి కావద్దని , మనమంతా ఒక్కటై కరోనా తో పోరాడుదామని , కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారు బ్లడ్ ప్లాస్మా డొనేట్ చేసి కరోనా బాధితులను కాపాడమని నాగచైతన్య ప్రజలకు పిలుపునిచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: