మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు రెండో సినిమాను కూడా కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వర్ష బొమ్మల జంటగా ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ లో `మిడిల్ క్లాస్ మెలోడీస్` అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఇక రీసెంట్ గానే వర్ష బొమ్మల పుట్టిన రోజు సందర్భంగా ఆమె లుక్ ను రిలీజ్ చేశారు.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో తన పాత్ర ఏంటో రివీల్ చేసాడు ఆనంద్ దేవరకొండ. గుంటూరులో నా సొంతగా టిఫిన్ సెంటర్ పెట్టాలని నాకల.. ఈ సినిమాలో ఆ పాత్ర పోషిస్తున్నాను అని అన్నాడు. కాగా వెనిగళ్ళ ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక కేరాఫ్ కంచరపాలెం సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు కానీ…లాక్ డౌన్ పరిస్థితుల వల్ల విడుదలను వాయిదా వేశారు. మరి చూద్దాం ఈ సినిమా ఆనంద్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: