టాలీవుడ్ లో 15 సంవత్సరాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ హీరోయిన్స్ లో ఎవరికి మీ ఓటు ?

Among These Veteran Tollywood Heroines Whom Do You Vote For?

టాలీవుడ్ లో 15 సంవత్సరాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ హీరోయిన్స్ లో ఎవరికి మీ ఓటు ?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనుష్క : “సూపర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “అరుంధతి “, రుద్రమ దేవి “, “భాగమతి ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ కు కేంద్ర బిందువుగా మారారు. “అరుంధతి “, రుద్రమ దేవి “, “వేదం “, బాహుబలి 2 “, “భాగమతి ” మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ “నిశ్శబ్ధం ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

నయనతార : బ్లాక్ బస్టర్ “లక్ష్మీ ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నయనతార తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ” శ్రీరామ రాజ్యం “, “అనామిక ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నయనతార పలు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటించి లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందారు. ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

తమన్నా :సక్సెస్ ఫుల్ “శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన తమన్నా పలు తెలుగు , తమిళ , హిందీ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోయిన్ గానే కాకుండా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తున్నారు. “100% లవ్” , “”తడాఖా “, “కెమెరా మెన్ గంగ తో రాంబాబు “, ” బాహుబలి 2″ మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా” సీటీ మార్ “, “బోలే చూడియన్ ” హిందీ మూవీ లో నటిస్తున్నారు.

త్రిష :”నీ మనసు నాకు తెలుసు ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన తమిళ హీరోయిన్ త్రిష పలు తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు తమిళ మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్న త్రిష “వర్షం” , “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”, “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. త్రిష ప్రస్తుతం 6 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

టాలీవుడ్ లో 15 సంవత్సరాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ హీరోయిన్స్ లో ఎవరికి మీ ఓటు ?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =