లాక్ డౌన్ వల్ల థియేటర్స్ ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు. అందుకే చిన్న సినిమాలు అన్నీ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయి అలరిస్తున్నాయి. ఇక పెద్ద సినిమా నిర్మాతలు మాత్రం అంత ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ అటు చిన్న బడ్జెట్ మరీ భారీ బడ్జెట్ లేని సినిమాల పరిస్థితే అయోమయంలో పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలో గత రెండురోజులుగా క్రాక్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు ఒట్టి రూమర్లే అని తేలిపోయింది. ఈ వార్తలపై స్పందించిన నిర్మాత ఠాగూర్ మధు వాటిని కొట్టిపడేశాడు. ఇంకా 15రోజుల షూటింగ్ మిగిలి ఉంది.. అలాంటప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ పై చర్చలు జరపడంలో పాయింటే లేదు.. ఈ సినిమా థియేటర్ లోనే రిలీజ్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడైనా ఈ రూమర్స్ ఆగుతాయేమో చూద్దాం.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది. మరి ఈ సినిమాతో అయినా రవితేజ హిట్ కొడతాడేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























