స్టోరీ సెలక్షన్ లోనే కాదు ఛాలెంజ్ లో కూడా తన వైవిధ్యతను చూపించాడు శ్రీవిష్ణు. ఇప్పటి వరకూ ఆ ఛాలెంజ్ అంటూ.. ఈ ఛాలెంజ్ అంటూ ఎన్నో ఛాలెంజ్ లు చూశాం. అయితే ఇప్పుడు శ్రీవిష్షు ‘డొనేట్ ప్లాస్మా’ అనే కొత్త ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టాడు. ఈ ఛాలెంజ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిద్దమయ్యాడు. దీనిలో భాగంగా ‘డొనేట్ ప్లాస్మా అండ్ సేవ్ లైఫ్’ అని ఉన్న డీపీ ని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని హీరో నారా రోహిత్, హీరోయిన్ నివేదా థామస్‌కు ఛాలెంజ్ ను విసిరాడు. ఈ కరోనా కష్టకాలంలో ప్లాస్మా గురించి అవగాహన కల్పించి ప్రాణాలను కాపాడాలని శ్రీవిష్ణు పిలుపునిచ్చాడు. మరి ఎన్నో పనికిరాని ఛాలెంజ్ లను వైరల్ చేశారు.. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఎంత వైరల్ అవుతుందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NewProfilePic As an initiative I’m changing my DP to #DonatePlasma. I’m nominating @IamRohithNara & @i_nivethathomas to take this further and create awareness to save lives in this #Covid pandemic situation.#StayStrong #StaySafe pic.twitter.com/BAXQ3wit0m
— Sree Vishnu (@sreevishnuoffl) July 10, 2020
కరోనా సోకిన వారికి కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీని చేయడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించాలి. అయితే చాలా మంది ముందుకు రాని నేపథ్యంలో… ప్రజల్లో ఈ ప్లాస్మా దానంపై అవగాహన కల్పించడానికి శ్రీవిష్ణు ఈ ఛాలెంజ్ చేపట్టాడు.
కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. శ్రీ విష్ణు, నివేదా థామస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా గత ఏడాది రిలీజ్ అయి మంచి టాక్ ను తెచ్చుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: