మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు మణిశర్మ అని. ఇక ఈ రోజు మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు విషెస్ చెపుతున్నారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ కూడా మణిశర్మ కు తన ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పాడు. అయితే కాస్త వెరైటీ గా చెప్పాడు. ఈరోజుకీ.. ఇంద్ర.. అని గ్యాప్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నోటితో అనేసి మళ్లీ ఇంద్ర అంటాము. అంత ఇంపాక్ట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్..’’ అని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Ee roju ki… Indra … ani gap ichi background score kooda notitho anesi mallee Indraa antaamu…. antha impact ichina
Music Director #ManiSharma gaaaru … Wishing U a Very Happy Birthday Sir 🙏🙏 https://t.co/EEY6W6ygrT— Harish Shankar .S (@harish2you) July 11, 2020
ఇదిలా ఉండగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు.. ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించాడు మణిశర్మ. ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర పనిచేసిన ఆయన “సూపర్ హీరోస్” చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. కెరీర్ మొదట మణిశర్మ బిజీ బిజీ గా సూపర్ హిట్స్ తో అందరు అగ్ర తారల సినిమాలకు మ్యూజిక్ అందించి.. అగ్రతారల మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎన్నో మెలోడీ సాంగ్స్ అందించారు. ఇరవై రెండేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని విజయాల్ని సొంతం చేసుకున్నారాయన. పెరిగిపోతున్న కాంపిటీషన్ వల్ల కొన్నేళ్లు గ్యాప్ వచ్చింది. ఇక రీసెంట్ గా పూరీ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్ళీ తన సత్తా చూపించాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. దీనితో ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా అవకాశాలు అందుకుంటూ మళ్ళీ తన బలాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీ గా ఉన్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: