విశాల్ `చ‌క్ర` ట్రైల‌ర్‌ రిలీజ్.. నాలుగు భాషల్లో ఒకేసారి..!

Vishal Chakra Movie Trailer Is Out In Four Languages

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు,త‌మిళ‌,మ‌ల‌యాళ‌,క‌న్న‌డ నాలుగు భాష‌ల్లో ఒకేసారి ట్రైల‌ర్ విడుద‌లైంది. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను రానా ద‌గ్గుబాటి, త‌మిళ ట్రైల‌ర్ ను యాంగ్రీ హీరో కార్తి, ఆర్య,‌ మల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్, క‌న్న‌డలో రాకింగ్ స్టార్ యశ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్‌డే హైద‌రాబాద్‌ సిటీ మొత్తం హై అల‌ర్ట్‌లో ఉంటుంది కాని ఆరోజు..అని విశాల్ వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన 2నిమిషాల 07 సెకండ్ల నిడివిగ‌ల‌ ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తి క‌రంగా సాగింది. ఒక దేశాన్ని బెదిరించే తీవ్ర‌వాదుల యాక్టివిటీస్‌ని గ‌మ‌నించ‌డానికి ఒక నేష‌న‌ల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీస‌ర్చ్ కంటే, ఓ స‌గ‌టు మ‌నిషి అవ‌స‌రాలు, వాడి ఆశ‌లు తెలుసుకోవ‌డం కోసం ఓ కార్పోరేట్ కంపెనీ చేసే రీస‌ర్చే ఎక్కువ అంటారు, క‌చ్చితంగా మ‌నం వెతికే క్రిమిన‌ల్ మ‌న కంటికి క‌నిపించ‌డు, ఇప్పుడే క‌దా వేడెక్కింది ది గేమ్ బిగిన్స్, కంటికి క‌నిపించ‌ని వైర‌స్ మాత్ర‌మే కాదు వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే.. వెల్‌క‌మ్ టు డిజిట‌ల్ ఇండియా వంటి డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. యువ‌న్ శంక‌ర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ స్వయంగా నిర్మిస్తుండగా శ్రద్దా శ్రీనాధ్, రెజీనా కాసాండ్రా, శ్రుతీ డాంగే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా రోబో శంకర్‌, కేఆర్‌ విజయ, మనోబాలా, విజయబాబు తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + nine =