పదివేల మందికి సాయం..!

Tollywood Actor Jagapathi Babu Distributes Daily Essential Groceries For Ten Thousand Needy People,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2020 Telugu Movie Updates,Tollywood Actor Jagapathi Babu,Actor Jagapathi Babu,Jagapathi Babu,Jagapathi Babu Latest News,Jagapathi Babu News,Jagapathi Babu Movie Updates,Jagapathi Babu Movies,Jagapathi Babu New Movie,Jagapathi Babu Upcoming Movies,Jagapathi Babu Distributes Daily Essential Groceries For Ten Thousand Needy People,Actor Jagapathi Babu Provides Daily Essential Groceries For 10000 Needy People,Actor Jagapathi Babu Provides Daily Essential Groceries,Jagapathi Babu Help,Jagapathi Babu Latest Film Updates

గుప్త దానాలు.. ఈ పేరు వినే వుంటారు కదా. అంటే మనం సాయం చేసినా పక్కన వాళ్ళకి తెలియకుండా ఉండటమే కదా దాని అర్ధం. ఇప్పుడు దీని గురించి ఎందుకంటే.. కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కష్టకాలంలో పేదలను ఆడుకోడానికి ఎంతో మంది సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి కూడా విదితమే. సినీ ప్ర‌ముఖులు దగ్గరనుండి సామాన్య ప్రజల దాకా వారికి తోచినంత వారు త‌మ వంతు సాయం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే జ‌గపతిబాబు ‌కూడా చాలా మంది సినీ కార్మికులకు త‌నే స్వ‌యంగా బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను అందించారు. అలాగే క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించిన విష‌యం తెలిసిందే. ఇవే కాకుండా ఇటీవ‌ల‌ ఇబ్బందులలో ఉన్న‌ ప‌దివేల మంది పేద‌ల‌కి నిత్యావ‌స‌ర స‌రుకులు, మాస్కులు, శానిటైజర్లను అంద‌జేశారు అని తెలిసింది. ఇదే విషయాన్ని జ‌గ‌ప‌తి బాబుని అడ‌గ‌గా ‘‘స‌హాయం చేసిన మాట వాస్త‌వ‌మే కాని చేసిన ప్ర‌తి స‌హాయం అంద‌రికీ తెలియాల్సిన అవ‌సరం లేదు క‌దా… ఆప‌ద‌లో ఉన్న వారికి స‌హాయం చేశాను’’ అని చెప్పారు. మరి ఇంత మందికి సాయం చేసి కూడా చెప్పుకోకపోవడం నిజంగా గొప్ప విషయమే కదా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − six =