టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మే 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ భీమవరపు కీలక ప్రకటన చేశారు. ‘లవ్ మీ’ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని తెలిపారు. త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు కూడా చెప్పారు. అలాగే ఈ సీక్వెల్ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ‘కిల్ మీ.. ఇఫ్ యు లవ్’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ తెరకెక్కిస్తామని వెల్లడించారు. కాగా ‘లవ్ మీ’ ఇంకా విడుదల కాకమునుపే సీక్వెల్ ప్రకటించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీనిని బట్టి మూవీ టీమ్ ఈ చిత్రం సక్సెస్‌పై ఎంత ధీమాగా ఉందో అర్ధమవుతుంది.
హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా.. అవినాష్ కొల్ల ఆర్ట్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఈ వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో ఈ సినిమా రాబోతోందని మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































