నిన్న కాక మొన్న చిరంజీవి మొదటి సినిమా ‘పునాది రాళ్ళు’ డైరెక్టర్ రాజ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం నెలకుంది. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోన్న ఆయన స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న పరిస్థితి మరీ విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి చేరుకొని . ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన పార్ధీవదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
పరమేశ్వరరావు 1948 మార్చి 16న కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్ ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్ గా కూడా చేసాడు. ఆ తర్వాత సురేశ్ ప్రొడక్షన్‌లో వచ్చిన తాజ్‌మహల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా అది సూపర్ హిట్ అవ్వడంతో శ్రీకాంత్ కెరీరే మారిపోయింది. రాఘవేంద్రరావు పెళ్లిసందడి సినిమాతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఫ్యామిలీ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: