బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నటసింహ బాలకృష్ణ, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను.. ముచ్చటగా మూడోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారు. అందులో ఒక పాత్ర కోసం అఘోరాగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు.. `నవగ్రహాలు` చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని… కథానాయకుడి కుటుంబంపై నవగ్రహాల ప్రభావం, ఆ నేపథ్యంలో సాగే భావోద్వేగాల సమ్మేళనంగా ఈ ఆధ్యాత్మిక కుటుంబ కథా చిత్రం ఉంటుందని సమాచారం. మరి.. ఈ కథనాల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
[custom_ad]
ఈ నెల 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న `యన్.బి.కె 106`.. జూలై నెలాఖరులో తెరపైకి వచ్చే అవకాశముంది. మరి.. `సింహా`, `లెజెండ్` తరువాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. బాలయ్య, బోయపాటికి హ్యాట్రిక్ ని అందిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: