కాస్త గ్యాప్ ఎక్కువ తీసుకున్నా అల్లుఅర్జున్ గట్టింగానే కొట్టాడు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. 2 రోజులకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 37 కోట్ల షేర్ సాధించడం విశేషం. మొదటి రోజు 26 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉండి 10 కోట్ల మేర షేర్ సాధించడంతో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అంతేనా ఓవర్సీస్ లో ‘అల వైకుంఠపురములో’ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అల వైకుంఠపురములో దెబ్బకి ఇంగ్లీష్ సినిమాలు కూడా నెమ్మదించాయి. అక్కడ లాస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పరంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది అల వైకుంఠపురములో.ఈ వారంలో విడుదలైన సినిమాల్లో టాప్ పది చిత్రాల తొలి వారం వసూళ్లను అమెరికన్ మీడియా అండ్ ఎనలిటిక్స్ కంపెనీ కామ్ స్కోర్ విడుదల చేసింది. టాప్ పది జాబితాలో హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి ‘అల వైకుంఠపురములో’ అగ్రస్థానంలో నిలిచింది
అల వైకుంఠపురములో రెండు రోజుల కలెక్షన్స్
నైజాం – 10.08 కోట్లు
సీడెడ్ – 5.19కోట్లు
యూఏ – 4.41 కోట్లు
వెస్ట్ – 2.91 కోట్లు
ఈస్ట్ – 4.19కొల్తు
గుంటూరు – 4.22 కోట్లు
కృష్ణ – 3.98 కోట్లు
నెల్లూరు – 1.60 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: