సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ – సైనికుల ఔన్నత్యాన్ని చాటే ‘సరిలేరు నీకెవ్వరు’

Sarileru Neekevvaru Movie Review

ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే సినిమా లక్ష్యం. ఆ ప్రాసెస్ లో సాధ్యమైన మేరకు సామాజిక ప్రయోజనాన్ని కూడా అందించగలిగితే మంచిదే. మంచిని  కూడా నీతి వాక్యాలుగా, సుమతీ శతకాలుగా కాకుండా వినోదాన్ని మేళవించి చెప్పినప్పుడే ప్రేక్షకులకు నచ్చుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీకు వినోదం కావాలా? సందేశాలు కావాలా అని అడిగితే “మాకు వినోదమే ప్రధానం… అది అందిస్తూ మీ ఇష్టమొచ్చిన సందేశాలు చెప్పుకోండి”- అని నిర్మొహమాటంగా చెప్తాడు ప్రేక్షకుడు . అందుకే దేశభక్తిని చెప్పినా, దైవభక్తిని చెప్పినా, మాతృ పితృ గురు భక్తి గురించి చెప్పినా , అమ్మాయి ప్రేమ గురించి చెప్పినా వినోదాత్మకంగా చెప్పండి మేము వింటాము… చూస్తాము అన్నదే ప్రేక్షకుడి మనోగతం.
అందుకే మన దర్శక నిర్మాతలు వినోదాత్మక సందేశాలు తీస్తారు గానీ సందేశాల పేరుతో చేతులు, మూతులు కాల్చుకునే విన్యాసాలు చెయ్యరు.

[custom_ad]

ఈరోజు అలాంటి వినోదాత్మక దేశభక్తి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది “సరిలేరు నీకెవ్వరు” . మహేష్ బాబు ప్రీవియస్ చిత్రాలైన భరత్ అనే నేను, మహర్షి చిత్రాల కోవలోనే సందేశ వినోదాలను  మేళవించి యువ దర్శకుడు అనిల్ రావిపూడి అందించిన ‘సరిలేరు నీకెవ్వరు’ పై ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కమ్ అందిస్తున్న స్పెషల్ రివ్యూ.

స్టోరీ లైన్:

మేజర్ అజయ్ కృష్ణ( మహేష్ బాబు) ఒక డైనమిక్ మిలటరీ ఆఫీసర్. ఉగ్రవాదుల చెర నుండి స్కూల్ పిల్లలను రక్షించే క్రమంలో  జరిగిన   అనూహ్య సంఘటనతో ఒక ముఖ్యమైన బాధ్యతను అతనికి అప్పగిస్తారు మిలటరీ అధికారులు.

ఆ బాధ్యత నెరవేర్చే నిమిత్తం కాశ్మీర్ నుండి కర్నూలుకు బయలుదేరుతాడు అజయ్ కృష్ణ. అతనికి తోడుగా వస్తాడు సీనియర్ మిలటరీ పర్సన్( రాజేంద్ర ప్రసాద్). ట్రైన్ లో వెళుతున్న వాళ్ళిద్దరికీ హీరోయిన్
సంస్కృతి( రష్మిక) వాళ్ల కుటుంబం తారసపడుతుంది. ఆ కుటుంబానిది ఒక కామెడీ స్టోరీ. ఆ ట్రైన్ ఎపిసోడ్ తో దాదాపు 25 నిమిషాల పాటు కడుపుబ్బ నవ్వించిన దర్శకుడు  ఇకమీదట “బొమ్మ దద్దరిల్లిద్ది” అనే  బ్యాంగ్ తో ఇంటర్వెల్ కార్డ్ వేసాడు.

[custom_ad]

ఇంటర్వెల్ తర్వాత నిజంగా బొమ్మ దద్దరిల్లిందా ? అసలు మిలిటరీ అధికారులు అజయ్ కృష్ణ కు అప్పగించిన బాధ్యత ఏమిటి? అతను కర్నూలు ఎందుకు వచ్చాడు ? కర్నూలులో ప్రొఫెసర్ భారతిని ఎందుకు కలిశాడు? ప్రొఫెసర్ భారతికి మంత్రి నాగేంద్ర ప్రసాద్( ప్రకాష్ రాజ్) కు మధ్య జరిగిన సంఘర్షణ ఏమిటి? అజయ్ కృష్ణకు ప్రొఫెసర్ భారతికి ఉన్న సంబంధం ఏమిటి? మంత్రి నాగేంద్ర ప్రసాద్ ను అజయ్ కృష్ణ ఎలా దారికి తెచ్చాడు? ఇత్యాది సందేహాలకు సమాధానంగా నడుస్తుంది ‘సరిలేరు నీకెవ్వరు’ కథా క్రమం.

ఎలా ఉంది:

కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తీయాలి అని ఫిక్స్ అయిన దర్శకులకు మ్యాజిక్కులు తప్ప లాజిక్కులతో నిమిత్తం ఉండదు. అదే మ్యాజికల్ ఫార్ములాను ఫాలో అవుతూ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన ఈ తాజా  మ్యాజిక్ చాలా వరకు క్లిక్ అయింది అని చెప్పవచ్చు.

[custom_ad]

నిజానికి మిలటరీ బ్యాక్ గ్రౌండ్ నుండి హీరో జనజీవనంలోకి వచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాల మీద పోరాడే కథాంశాలతో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే ఇలాంటి కథాంశంలో బరువైన సన్నివేశాలు, భారమైన డైలాగులతో కూడిన మెలో డ్రామాకు మాత్రమే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఎంటర్టైన్మెంట్ కు అవకాశం చాలా తక్కువ. డ్రైనెస్ , డాక్యుమెంటేషన్ ఎక్కువగా ఉండే కథల్లో ఎంటర్టైన్మెంట్ ను జోడించడం కత్తి మీద సాము లాంటిది. పాత్రల ఔచిత్య , ఔన్నత్యాలు దెబ్బతినకుండా కామెడీ పండించడం చాలా కష్టం. కానీ ఆ ప్రయత్నంలో దర్శకుడు అనిల్ రావిపూడి చాలా వరకు సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.

కొన్ని సందర్భాలలో కొంచెం ‘అవుట్ ఆఫ్ ద వే’ గా వెళ్లినప్పటికీ ఓవరాల్ గా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఒక మంచి  పేట్రియాటిక్ ఎంటర్టైనర్ గా మలిచాడు దర్శకుడు. ముఖ్యంగా  మన రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల ఆత్మ త్యాగాల విలువ ఏమిటో  ప్రతి ఒక్కరికి తెలియాలి అనే గొప్ప సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పటానికి ప్రయత్నించటం అభినందనీయం.
ఈ ప్రయత్నంలో అక్కడక్కడ కొంత సాగతీత కనిపించినప్పటికీ మొత్తం మీద కామర్స్ ను కమిట్మెంట్ ను చక్కగా మేళవించి తన గత చిత్రాల పంథాలోనే వినోదాత్మక విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడికి అభినందనలు.

పర్ఫార్మెన్సస్ :

ఈ సినిమాలోని ఒక పాటలో యూ అర్ క్యూట్ .. హ్యాండ్సమ్ అంటూ మహేష్ బాబు వెంట పడుతుంది హీరోయిన్. నిజంగానే క్యూట్ నెస్ కు, అందానికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించేంత అందంగా ఉన్నాడు మహేష్ బాబు. దానికి తోడు తను పోషించిన మేజర్ అజయ్ కృష్ణ క్యారెక్టర్లో ఉన్న సీరియస్నెస్ ను, చిలిపితనాన్ని అద్భుతంగా అభినయించి అభిమానులను గొప్పగా అలరించాడు మహేష్ బాబు.

ఇక 13 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన విఖ్యాత నటీమణి విజయశాంతి స్క్రీన్ ప్రెజెన్స్ గొప్పగా ఉంది. ప్రొఫెసర్ భారతీ క్యారెక్టర్లోని నిజాయితీకి, నిండు తనానికి దర్పణంగా నిలిచింది ఈ జాతీయ ఉత్తమ నటి. నిజానికి ఆ పాత్ర ఆమె మాత్రమే చేయాలి అని వెంటపడి మెప్పించి , ఒప్పించింది ఎందుకో అర్థమవుతుంది సినిమా చూశాక. ప్రస్తుతం ఉన్న సీనియర్ నటీమణులలో ఆ పాత్రలో విజయశాంతిని తప్ప మరొకరిని ఊహించలేము.

[custom_ad]

ఇక మినిస్టర్ నాగేంద్ర ప్రసాద్ పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటన గొప్పగానే ఉన్నప్పటికీ  ఆయన ఇలాంటి పాత్రలు ఎన్నెన్నో చేసి ఉండటంతో మరో రొటీన్ క్యారెక్టర్ గా మాత్రమే అనిపిస్తుంది. మిగిలిన అన్ని పాత్రలు…  ఆయా పాత్రధారులకు కొట్టినపిండి లాంటి రెగ్యులర్ క్యారెక్టర్స్ గానే అనిపిస్తాయి.

టెక్నికల్ గా:

[custom_ad]

ఇంత భారీ అంచనాల భారీ చిత్రానికి సాంకేతికంగా కూడా అన్ని హంగులు సమకూరటంలో ఆశ్చర్యమేమీ లేదు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు వంటి భారీ నిర్మాతల మేకింగ్ వేల్యూస్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం , రత్నవేలు కెమెరా, తమ్మిరాజు ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ యాక్షన్స్  వంటి  సాంకేతిక బలాల తోడవటంతో  “సరిలేరు నీకెవ్వరు” అన్ని విధాల భారీతనాన్ని సంతరించుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − five =