నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాతోనే కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా వుంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. మా కుటుంబానికి చెందిన ఇద్దరు ఈ చిత్రంతో పరిచయ కావడం ఎంతో ఎమోషన్‌గా వుంది. ఈ సినిమా చూశాను.. తీపి కారం ఒకేసారి తిన్నట్ట అనిపించింది. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా నచ్చిందన్నారు. అంతేకాదు సినిమా చూసి ఆడియన్స్ హానెస్ట్ క్రిటిసిజం ఇవ్వాలని కూడా కోరారు. ‘కొత్తగా దర్శకత్వం చేయాలనుకునే వారందరికి ‘మత్తు వదలరా’ చిత్రం ఓ మంచి ఉదాహరణ. నిర్మాత నమ్మి డబ్బులు పెట్టాలంటే మీ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ కలగాలి. ఈ సినిమా దర్శకుడు రితేష్ రానా సొంతంగా టీమ్ ఫామ్ చేసుకుని, నిర్మాతకు నమ్మకం కలిగించి ఈ చిత్ర దర్శకత్వ అవకాశాన్ని సంపాందించాడు. రితేష్ ఐడియా నాకు బాగా నచ్చిందని’ అన్నారు. ఇంకా ఈ చిత్ర నిర్మాత గురించి చెబుతూ.. చెర్రి ఎంతో ప్లానింగ్ వున్న వ్యక్తి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తాడు. అందుకే చెర్రి అంటే నాకు చాలా ఇష్టం. నా యమదొంగకు నిర్మాత చెర్రినే. నా కెరీర్‌లో అతి తక్కువ సమయంలో తీసిన సినిమా అదే. దానికి కారణం చెర్రీ ప్లానింగే అన్నారు.
ఇంకా ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ .. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: