సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్… ప్రస్తుతం `వెంకీమామ`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యువ సామ్రాట్ నాగచైతన్య మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… డిసెంబర్‌లో రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు… సంక్రాంతి బరిలో `వెంకీమామ` దిగుతాడనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, చిత్రబృందం మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ లోపే… వెంకటేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పలు కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా… `పెళ్ళిచూపులు` ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ తదుపరి చిత్రం ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. `మలక్‌పేట హార్స్ రేస్ క్లబ్` నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని… ఇందులో గుర్రపు పందాలపై బెట్టింగ్స్ కాసే వ్యక్తిగా వెంకీ కనిపిస్తాడని టాక్. అంతేకాదు… సినిమా మొత్తం వెంకీ తెలంగాణ యాసలో సందడి చేస్తాడని వినిపిస్తోంది. మరి… ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: