‘విక్టరీ’ వెంకటేష్ కెరీర్‌లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘ముద్దుల ప్రియుడు’ ఒకటి. ‘కలియుగ పాండవులు’, ‘కూలీ నెం.1’, ‘సుందరకాండ’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ‘విక్టరీ’ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. రమ్యకృష్ణ, రంభ నాయికలుగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో… కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం, సుత్తివేలు, బాబూమోహన్, అన్నపూర్ణ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’(1965) స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్.కె.ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె.కృష్ణమోహనరావు నిర్మించిన ఈ చిత్రానికి… ఎం.ఎం.కీరవాణి వీనుల విందైన బాణీలు అందించారు. “వసంతంలా వచ్చి పోవాలిలా”, “సిరిచందనపు చెక్కలాంటి”, “ఎవరో రావాలి”, “చిటపట”, “నాకే గనక నీతోనే గనక” వంటి జనరంజకమైన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1994 సెప్టెంబర్ 1న విడుదలైన ‘ముద్దుల ప్రియుడు’… నేటితో పాతికేళ్ళు పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























