మాజీ సీఎం పాత్రలో మురళీ శర్మ..?

Senior Actor Murali Sharma To Play Karunanidhi Role

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ తలైవి సినిమా రోపొందుతున్న సంగతి తెలిసిందే. రాజకీయం అనే పోరులో ఎదురైనా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ముఖ్య మంత్రి స్థానం వరకూ ఆమె ఎలా ఎదిగారు.. రాజకీయంలో ఎదుర్కొన్న వివాదాలు ఇలా అన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు. తలైవి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జయలలిత పాత్ర లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఎప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది. ఇప్పటికే ఈ బయోపిక్ లో కంగనాతో పాటు మరో కీలక పాత్ర అయిన ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తున్నాడు. అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు మురళీ శర్మ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. మరి వారు ఏం పత్రాలు పోషిస్తున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న తలైవి మూవీ లో జయలలితగా నటిస్తున్న కంగన తమిళ భాష ను నేర్చుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =