UV క్రియేషన్స్, T-సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా తెలుగు,తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ భారీ అంచనాలతో ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సాహో మూవీ రిలీజ్ కు 7రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాహో మూవీ రిలీజ్ కు ముందే పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్ క్రియేట్ చేసిన సాహో థియేటర్ అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది. ప్యారిస్ లో గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ప్రదర్శించబోతున్న ప్రభాస్ రెండవ మూవీ గా రికార్డ్. ఇప్పుడు ట్విట్టర్ ఎమోజి సింబల్ తో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ది లయన్ కింగ్, ఎవెంజర్స్, స్పైడర్ మాన్, భారత్ (సల్మాన్ ఖాన్ )మూవీస్ కు ట్విట్టర్ ఎమోజి లు తయారుచేసింది. ట్విట్టర్ ఎమోజి పొందిన మొదటి తెలుగు సినిమాగా సాహో మూవీ ఘనత సాధించింది.
It’s finally here! Check out the official Saaho Twitter Hashmoji! ☺
Tweet using #Saaho#సాహో#சாஹோ #SaahoInCinemas #WorldSaahoDayThank you @TwitterIndia
— UV Creations (@UV_Creations) August 23, 2019
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























