ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే… మరో సినిమాను లైన్‌లో పెడుతూ… వరుస చిత్రాలతో బిజీగా మారుతున్నాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం… ఈ టాలెంటెడ్ హీరో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు… ‘బ్రేకప్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఇందులో విజయ్ ప్లే బాయ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు సమాచారం. కాగా… ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… విజయ్ దేవరకొండ ప్రస్తుతం మల్టీలింగ్వల్ మూవీ ‘హీరో’లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే… పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘ఫైటర్’లోనూ నటించనున్నాడు. జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా… 2020 వేసవిలో రిలీజ్ కానుందని సమాచారం. మరి… తక్కువ గ్యాప్‌లో రానున్న ఈ మూడు చిత్రాలతో… విజయ్ ఏ స్థాయి విజయాలను అందుకుంటాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: