విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ బెస్ట్ హిట్‌ ‘గీత గోవిందం’కి ఏడాది

#1YearsForGeethaGovindam, Geetha Govindam Movie Updates, Geetha Govindam Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vijay Deverakonda Geetha Govindam Completes 1 Year, Vijay Deverakonda Geetha Govindam Movie Completed 1 Years For Today
“ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాల్లే ఇది చాల్లే”… అనిపించే స్థాయి ఘ‌న‌విజ‌యం సొంతం చేసుకున్న చిత్రం `గీత గోవిందం`. మీడియం బ‌డ్జెట్ మూవీస్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌… యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చింది. గీత‌గా ర‌ష్మిక మంద‌న్న‌… గోవిందంగా విజ‌య్ న‌టించిన ఈ చిత్రంలో వీరిద్ద‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇక ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ సంభాష‌ణ‌లు, ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ చిత్రాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళాయి. నిత్య మీనన్, అను ఇమ్మాన్యుయేల్ అతిథి పాత్రల్లో దర్శనమిచ్చిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో నాగబాబు, సుబ్బరాజు, ‘వెన్నెల’ కిషోర్, రాహుల్ రామ‌కృష్ణ‌, అన్న‌పూర్ణ‌, గిరిబాబు తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలు పోషించారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రానికి గోపిసుందర్ అందించిన బాణీలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ముఖ్యంగా అనంతశ్రీరామ్ కలం నుంచి జాలువారిన “ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి” పాట అయితే… 2018లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్‌గా నిలచింది. 2018 ఆగస్టు 15న విడుదలైన ‘గీతగోవిందం’… నేటితో ఏడాది పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=MzOtJcN6wZw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 12 =