అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ లో బిజీ గా వుంది. ఇక ఈ షూటింగ్ లో తాజాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పాల్గొననుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా తన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని రష్మిక మందన తెలియజేసింది. తన ట్విటర్ ద్వారా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో భాగంగా నా మొదటి షెడ్యూల్ పూర్తయింది.. సెట్ లో అన్నీ నవ్వులే నవ్వులు.. అంటూ తెలియజేసింది.
It’s a wrap of Sarileru Neekevvaru 1st schedule for me..
amazing people..
so many laughs-giggles-one mores-hilarious moments..♥️
Can’t wait to be back..🌸♥️— Rashmika Mandanna (@iamRashmika) August 14, 2019
కాగా ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమాతో మహేష్, అనిల్ రావిపూడి మరో హిట్ కొడతారేమో చూద్దాం..
కాగా రష్మిక ఈ సినిమాతో పాటు వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తుంది.
[youtube_video videoid=zCzNEtv7DzE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: