ప్రస్తుత దర్శకుల సంఘం, అందరి దర్శకుల సహాయ సహకారాలతో జులై 24 వతేది తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ రిజిస్టర్ అయింది. ఈ ట్రస్ట్ కు సీనియర్ దర్శకుడు K రాఘవేంద్ర రావు ఛైర్మన్, N శంకర్ మేనేజింగ్ ట్రస్టీ, మెహెర్ రమేష్ ట్రెజరర్, VV వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నందిని రెడ్డి ట్రస్టీలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంఘ సభ్యులలో ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్నవారికి ఆరోగ్య, విద్య, కుటుంబ అవసరాలకు సహాయపడేలా ఒక నిధి ని ఏర్పాటు చేసి, ఆ నిధి పై వచ్చే వడ్డీతో అర్హులైన వారికి తోడ్పాటు నిచ్చేలా ట్రస్ట్ ఏర్పడింది. ముందుగా దర్శకధీర రాజమౌళి ఈ ట్రస్ట్ కు 50 లక్షలు విరాళం అందజేశారు. ఆర్క మీడియా 15లక్షలు, రాఘవేంద్ర రావు 10 లక్షలు విరాళ మిచ్చారు. ముఖ్య అతిథి గా విచ్చేసిన మెగా స్టార్ చిరంజీవి ట్రస్ట్ ఆలోచనకు ఇంప్రెసయి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
[youtube_video videoid=bOGTp-s16ow]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: