“క్రాంతి” గా బాల‌కృష్ణ‌?

Interesting Title For Balakrishna New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Balakrishna Upcoming Film Title, Balakrishna Next Movie Title as Kranthi,Balakrishna New Movie News,Crazy Title For Balakrishna New Movie
Interesting Title For Balakrishna New Movie

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ‘క్రాంతి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడట. అంతేకాదు… ఈ సినిమాలో బాలయ్య స్క్రీన్ నేమ్ కూడా క్రాంతి అని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ‘క్రాంతి’ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. కొన్నాళ్ళ క్రితం ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే… ఇప్పుడు ‘క్రాంతి’ ఫైనల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ టైటిల్‌కు సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించ‌నున్న‌ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రచారం సాగుతోంది.

[subscribe]

[youtube_video videoid=jUxnrFUYzBA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 11 =