2015లో విడుదలైనఅఖిల్‌చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు అక్కినేని అఖిల్. ఆపై హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో పలకరించాడు. ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా… నటుడిగా మాత్రం అఖిల్‌కి మంచి పేరే తెచ్చాయి. కాగా… మిస్టర్ మజ్ను తరువాత స్పల్ప విరామం తీసుకున్న ఈ యంగ్ హీరో… ఇప్పుడు కథానాయకుడిగా తన నాలుగో చిత్రాన్ని మొదలుపెట్టే పనిలో ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ నిర్మించనుంది. ఈ నెలాఖరులో పూజా కార్యక్రమాలను నిర్వహించి… మే రెండో వారం నుంచి చిత్రీకరణ జరిపే దిశగా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా కియరా అద్వాని నటించబోతోందని ఆ మధ్య వార్తలు వినిపించినా… తాజా సమాచారం ప్రకారం ఆ అవకాశం ఛలో భామ రష్మిక మందన్నకి దక్కిందని టాక్. త్వరలోనే రష్మిక ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి… ఈ సినిమాతోనైనా అఖిల్ ఖాతాలో తొలి విజయం చేరుతుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=25djUzLFwso]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























