క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను పొందిన కథానాయకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తన కటౌట్‌కు తగ్గట్టు కేవలం యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా… ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లోనూ మెస్మరైజ్ చేశాడు ఈ మ్యాచో స్టార్. అలా… ప్రభాస్ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన చిత్రాలలో మిస్టర్ పర్‌ఫెక్ట్
ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన దిల్
రాజు ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మితమైన ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా కాజల్, తాప్సీ నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, మురళీ మోహన్, కె.విశ్వనాథ్, నాజర్, తులసి, ప్రగతి, బ్రహ్మానందం, బిగ్‌బాస్ 2
ఫేమ్ కౌశల్ దర్శనమిచ్చారు. సంతోషం
ఫేమ్ దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు ఎస్సెట్‌గా నిలిచాయి. చలి చలిగా
, ఆకాశం బద్ధలైనా
పాటలు అప్పట్లో యువతరాన్ని విశేషంగా అలరించాయి. 2011 ఏప్రిల్ 22న విడుదలైన మిస్టర్ పర్‌ఫెక్ట్
… నేటితో 8 వసంతాలను పూర్తిచేసుకుంది.
[subscribe]
[youtube_video videoid=kp1Lkmun9UM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.