కొందరి నట జీవితాల్లోని పోరాటపటిమను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు అగ్రతారలుగా అందలాలపై కనిపిస్తున్న వారు కెరీర్ ప్రారంభ దినాలలో పడిన స్ట్రగుల్ చూస్తే “ఫైటింగ్ స్పిరిట్”అంటే ఇది కదా అనిపిస్తుంది. ఎటు చూసినా చీకటి, దారి కనిపించదు… అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంటాయి.. ఒకవేళ అవకాశాలు వచ్చినా అవి ఫెయిల్ అవుతుంటాయి… అలాంటి స్థితిలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగి చివరకు విజయ తీరాలను ముద్దాడితే ఆ కిక్కే వేరప్పా..అలాంటి కిక్ ను తనివితీరా ఎంజాయ్ చేసిన రియల్ హీరోలలో విక్రమ్ ఒకడు. ఈ రోజున సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ గా ఎదిగిన విక్రమ్ ఒకప్పుడు చిన్నచిన్న వేషాల వేటలో అలసిపోయిన ఫ్రస్టేటెడ్ యాక్టర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ, మలయాళ, తెలుగు రంగాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇక ఈ జీవితం ఇంతే అనుకున్న తరుణంలో ‘బాలా’ దర్శకత్వంలో వచ్చిన “సేతు” “పితామగన్” చిత్రాలు విక్రమ్ రూట్ ను, ఫేట్ ను మార్చేశాయి. వీటిలో సేతు ‘శేషు’ గా తెలుగులోకి రీమేక్ అవ్వగా “పితామగన్” ‘శివపుత్రుడు’ గా తెలుగులోకి డబ్ అయింది. తమిళంలో సేతు, తమిళ, తెలుగు భాషల్లో ‘పితామగన్’ హిట్టవటంతో విక్రమ్ రెండు భాషల్లోనూ పాపులర్ అయ్యాడు. ఆ వెంటనే శంకర్ దర్శకత్వంలో వచ్చిన “అనియన్” తెలుగులోకి “అపరిచితుడు” గా అనువదింపబడి విక్రమ్ కు సూపర్ స్టార్ డమ్ తెచ్చి పెట్టింది.

ఆ తరువాత విక్రమ్ హీరోగా వచ్చిన అనేక భారీ చిత్రాలలో కొన్ని ఫెయిల్ అయినప్పటికీ పర్ఫార్మర్ గా విక్రమ్ కు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ , ప్రాంతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా పలు అవార్డులు అందుకున్న విక్రమ్ ను ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డ్ ఐదు పర్యాయాలు వరించడం విశేషం. అలా అవార్డులతోపాటు రివార్డులను కూడా సమస్థాయిలో అందుకున్న విక్రమ్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా విలక్షణ నటుడు విక్రమ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ అతను నటించిన 6 చిత్రాలలో ఏది బెస్ట్? అని నిర్ణయించే బాధ్యతను మీ మీద పెడుతోంది ” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”. జయాపజయాల సంగతి పక్కన పెట్టి ఈ 6 చిత్రాలలో ఏ చిత్రంలో విక్రమ్ నటన మిమ్ములను విశేషంగా అలరించిందో ఈ పోల్ గేమ్ ద్వారా తెలియజేయండి.
[totalpoll id=”19211″]
[subscribe]
[youtube_video videoid=o_H5kYuOCYg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: