వాల్మీకి లాంగ్ షెడ్యూల్ లో వరుణ్

Varun Tej Valmiki Movie Long Schedule Underway,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Valmiki Shoot Commences Today,Varun Tej Valmiki Movie Shooting Updates,Valmiki Movie Shooting Starts Today,Varun Tej New Movie Shoot Begins
Varun Tej Valmiki Movie Long Schedule Underway

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మూవీ జిగర్తాండ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే…గత నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుగుతుంది. ఇక ఈషెడ్యూల్ లో మెగా హీరో వరుణ్ తేజ్ పాల్గొంటున్నాడు. సుమారు 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో తమిళ యువ హీరో అథర్వ మురళి.. ఆయనకు జోడీగా తమిళ డబ్ స్మాష్ ఫేమ్ మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాతోపాటు ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు.

[subscribe]


[youtube_video videoid=t-SWlHFaFUk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =