17 ఏళ్ల క్రితం పారిస్ లో ‘మన్మథుడు’ గా కింగ్ నాగార్జున చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేము. ఇప్పటికీ ‘మన్మథుడు’ పేరు వినగానే ఆ హాస్య సన్నివేశాలు కళ్లముందు కదలాడతాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… ‘మన్మథుడు’ సీక్వెల్ గా రూపొందుతున్న ‘మన్మథుడు 2’ లోను ఫారిన్ బ్యాక్ డ్రాప్ కామెడీ సీన్స్ కి స్కోప్ ఉంది. అయితే… ఈసారి పారిస్ కాకుండా పోర్చుగల్ కు పయనం అవుతున్నాడు ఈ రెండో మన్మథుడు.
కాస్త వివరాల్లోకి వెళితే… 2002 లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మన్మథుడు’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘మన్మథుడు 2’ లో నాగార్జున కథానాయకుడు గా నటిస్తుండగా… అతనికి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ని అక్కినేని నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే… ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘మన్మథుడు 2’ కి సంబంధించిన రెండో షెడ్యూల్ వచ్చే వారం నుంచి పోర్చుగల్ పరిసర ప్రాంతాల్లో జరుగనుంది. నాగ్, రకుల్, వెన్నెల కిశోర్ తదితరులపై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నిరవధికంగా జరుగనున్న ఈ షెడ్యూల్ తో సింహ భాగం చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం.
కాగా… ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
[subscribe]
[youtube_video videoid=rdma778BpC0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























