ఈ వేసవిలో పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా… ఏప్రిల్ నెలలో ప్రతీ వారం కనీసం రెండేసి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ప్రతీ వారం కూడాఆ ఓ హారర్ కామెడీ ఫిల్మ్ రాబోతుండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఏప్రిల్ 6న ఉగాది కానుకగా హారర్ కామెడీ ఫిల్మ్ `ప్రేమకథా చిత్రమ్ 2` రాబోతోంది. ఇందులో సుమంత్ అశ్విన్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే ఏప్రిల్ 12న ప్రభుదేవా, తమన్నా నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ `అభినేత్రి 2` రిలీజ్ కానుంది. ఇక ఏప్రిల్ 19న రాఘవ లారెన్స్, వేదిక, ఓవియా ముఖ్య పాత్రల్లో నటించిన `కాంచన 3` సందడి చేయనుంది. అంతేకాదు… నందిత ప్రధాన పాత్రలో నటించిన హారర్ టచ్ ఉన్న థ్రిల్లర్ మూవీ `విశ్వామిత్ర` కూడా ఇదే ఏప్రిల్‌లో థియేటర్లలోకి రానుంది. మరి… ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమాకి ఆదరణ దక్కుతుందో చూడాలి.
[youtube_video videoid=j-DqC0wLGAE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: