ఇంద్రగంటితో `ఆ న‌లుగురు` మ‌రోసారి…

Director Mohan Krishna Indraganti New Movie Update,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Director Mohan Krishna Indraganti Next Film News,Mohan Krishna Indraganti Next Project Details,Mohan Krishna Indraganti Upcoming Movies,Director Mohan Krishna Indraganti New Movie Updates
Director Mohan Krishna Indraganti New Movie Update

కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాల‌ను రూపొందించ‌డంలో సెన్సిబుల్ డైరెక్ట‌ర్ ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ శైలే వేరు. `అష్టా చ‌మ్మా` నుంచి `స‌మ్మోహ‌నం` వ‌ర‌కు ఇంద్ర‌గంటి తెర‌కెక్కించిన ప‌లు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ఈ నేప‌థ్యంలోనే… మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రం చేసేందుకు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండ‌గా… నాని ఓ డిఫ‌రెంట్ రోల్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. అలాగే… నానికి జోడీగా అదితి రావ్ హైద‌రీ న‌టిస్తుండ‌గా… సుధీర్‌కి జంట‌గా నివేదా థామ‌స్ న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ న‌లుగురు కూడా గ‌తంలో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ సినిమాల్లో న‌టించిన వారే కావ‌డం విశేషం. ఇప్ప‌టికే `అష్టాచ‌మ్మా`, `జెంటిల్ మన్` చిత్రాల్లో నాని… `జెంటిల్ మన్ `లో నివేదా… అలాగే `స‌మ్మోహ‌నం`లో సుధీర్ బాబు, అదితి… న‌టించి మంచి విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్నారు. అంతేకాదు… వీరిలో ఒక్క సుధీర్ బాబుని మిన‌హాయిస్తే… మిగిలిన ముగ్గురూ ఇంద్ర‌గంటి సినిమాల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. మ‌రి… వీరి అపూర్వ క‌ల‌యిక‌లో క్రిస్మ‌స్ కానుక‌గా రానున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=36R_E-OYNIc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + one =