రవితేజ… మాస్ ఎంటర్‌టైనర్‌లకు పెట్టింది పేరు. దాదాపు రెండు దశాబ్దాలుగా కథానాయకుడిగా అలరిస్తున్నాడు ఈ మాస్ మహారాజా. ప్రస్తుతం `డిస్కోరాజా`, `తెరి` రీమేక్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… పూర్వాశ్రమంలో రవితేజ దర్శకత్వ శాఖలో పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే… కథానాయకుడిగా బిజీ కావడంతో మెగాఫోన్ పట్టే సమయం దొరకలేదు. ఆ మధ్య కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో… దర్శకత్వం వహించే ఆలోచన ఉందని… సమయం వచ్చినప్పుడు తప్పక చేస్తానన్నాడు రవితేజ. చూస్తుంటే… ఆ సమయం రానే వచ్చిందనిపిస్తోంది.
ఎందుకంటే… ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే… త్వరలోనే రవితేజ మెగాఫోన్ పట్టనున్నాడట. అంతేకాదు… ఇప్పటికే తన `కిక్ 2` నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్‌కి ఓ ఆసక్తికరమైన కథ చెప్పాడని… రవితేజ నేరేషన్ నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా నటించే ఆలోచనలోనూ కళ్యాణ్ రామ్ ఉన్నాడని టాక్. తను దర్శకత్వం వహిస్తే… ఆ చిత్రంలో హీరోగా నటించనని ఇప్పటికే రవితేజ చెప్పాడు. ఇప్పుడు అదే తీరున ఈ మాస్ మహారాజా తొలి డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ వెళ్ళనుందన్నమాట.
మరి… రవితేజ తొలి దర్శకత్వం పై వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
[youtube_video videoid=zrG2PzmMMR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: