`మహానటి`తో కేరళ కుట్టి కీర్తి సురేష్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎంతలా అంటే… `మహానటి`కి ముందు, తరువాత అన్నంతగా ఆమె కెరీర్ మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలో… ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. అభినయానికి అవకాశమున్న పాత్రలు లభిస్తుండడంతో… హిందీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది కీర్తి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `మహానటి` తరువాత తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయిన కీర్తి… ఎట్టకేలకు ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా `118`తో హిట్ కొట్టిన యువ నిర్మాత మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తున్న ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీని డెబ్యూ డైరెక్టర్ నరేంద్ర రూపొందిస్తున్నాడు.
కాగా… తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని… మలి షెడ్యూల్ యు.ఎస్.లో జరిపేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. ఇదో భారీ షెడ్యూల్ అని… ఎక్కువ రోజుల పాటు సాగే ఈ షూట్‌తో సింహభాగం చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. మరి… ఈ ఏడాది ద్వితీయార్ధంలో రానున్న ఈ సినిమాతో కీర్తి మరో ఘనవిజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
[youtube_video videoid=IuevT8El4T0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: