ఒకే కథానాయిక నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున లేదంటే వారం రోజుల గ్యాప్‌లో తెరపైకి రావడం అప్పుడప్పుడు జరిగేదే. అగ్ర తార సమంత కూడా ఈ వేసవికి వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో సందడి చేయబోతోంది. ఆమె నటించిన తమిళ చిత్రం `సూపర్ డీలక్స్` ఈ నెల 29న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుండగా… అది రిలీజైన వారం రోజుల తరువాత స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ `మజిలీ` ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల్లోనూ ఆసక్తికరమైన పాత్రల్లో దర్శనమివ్వనుంది సామ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… సామ్ తరహాలో మరో యువ కథానాయిక కూడా వారం గ్యాప్ లో రెండు చిత్రాలతో పలకరించనుంది. ఆమె మరెవరో కాదు… `ఎక్కడికి పోతావు చిన్నవాడా`తో అలరించిన టాలెంటెడ్ బ్యూటీ నందితా శ్వేత.
నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ `ప్రేమకథా చిత్రమ్ 2` ఏప్రిల్ 6న విడుదల కానుండగా… ప్రభుదేవా, తమన్నాతో కలసి నందితా శ్వేత నటించిన మరో హారర్ కామెడీ ఫ్లిక్ `దేవి 2` ఏప్రిల్ 12న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్‌కి రెడీ అవుతోంది.
మరి… బ్యాక్ టు బ్యాక్ వీక్స్‌లో వస్తున్న ఈ చిత్రాలతో సమంత, నందితా శ్వేత ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.
[youtube_video videoid=jNZPdlUP7cc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: