ఏ ముహూర్తాన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా “ఎన్టీఆర్ కథానాయకుడు”, “ఎన్టీఆర్ మహా నాయకుడు” చిత్రాలు ప్రారంభమయ్యాయోగానీ అప్పటినుండి తెలుగుదేశం పార్టీకి తలపోటు తెప్పించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒకవైపు ఎన్టీఆర్ జీవిత చరిత్ర తొలి భాగంగా విడుదలయిన “ఎన్టీఆర్ కథానాయకుడు” టాక్ పరంగా బాగున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా బాగా నిరాశకు గురిచేసింది. ఇక ఇదే సమయంలో మూకుమ్మడి దాడి అన్నట్లుగా ఒకవైపు నాదెండ్ల భాస్కరరావు, మరోవైపు నాగబాబు, ఇంకొకవైపు లక్ష్మీపార్వతి విమర్శల తీవ్రతను పెంచారు. ఆ విమర్శల ప్రభావం ” ఎన్టీఆర్ కథానాయకుడు” కలెక్షన్స్ ను దెబ్బతీసాయని వాదించేవారు లేకపోలేదు. అయితే తెలుగుదేశం వర్గాలు వాటిని ఏమాత్రం ఖాతరు చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ వివాదాలకు, సంచలనాలకు కేంద్రబిందువైన రాంగోపాల్ వర్మ వాలంటైన్స్ డే గిఫ్ట్ అంటూ నిన్న విడుదల చేసిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైలర్ మాత్రం తెలుగుదేశం వర్గాలలో నిజంగానే కలవరం పుట్టిస్తుంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే లక్షలాది హిట్స్ తో టాప్ హీరోల ట్రైలర్స్ కు సమానంగా వ్యూవర్షిప్ సాధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రకటించినప్పుడు ఎవరూ దాన్ని పెద్దంత సీరియస్ గా తీసుకోలేదు. ఏవేవో ప్రకటనలు చేయటం మధ్యలో మిడిల్ డ్రాప్ అవటం వర్మకు కొత్త కాదు… అతని గురించి తెలిసిన జనానికి కొత్త కాదు అనుకున్నారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసిన తర్వాత వర్మ నందమూరి కుటుంబాన్ని, నారా చంద్రబాబు నాయుడు వర్గాన్ని ఎంతగా గెలుకుతున్నాడో అర్థం అయింది. మేకింగ్, టేకింగ్ పరంగా వర్మ ఒక గొప్ప సినిమా తీసివుంటాడు అనుకోవటానికి వీల్లేదు. కానీ చరిత్ర, వాస్తవాలు అంటూ సంచలనాత్మక విషయాలను తెరకెక్కించి వివాదాస్పద విజయాలను సాధించడంలో వర్మ అందెవేసిన చెయ్యి అని అందరికీ తెలిసిందే. వర్మ వైఖరి,పోకడ పట్ల తెలుగుదేశం వర్గాలు తమ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, కేసులు వేస్తామని హెచ్చరిస్తూ, సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇస్తుంటే రాంగోపాల్ వర్మ వారిని మరింతగా రెచ్చగొడుతూ ” నా సినిమాను అడ్డుకునే దమ్ము ఎవడికుందో రండి “- అంటూ బహిరంగ సవాళ్లకు, చర్చలకు ‘సై’ అంటున్నాడు.
వర్మ చేస్తున్న ఈ బహిరంగ రచ్చను పట్టించుకుంటే ఒక చావు… పట్టించుకోకుండా వదిలేస్తే ఇంకొక చావు…వాళ్ళ ప్రతిఘటనైనా , వాళ్ల మౌనాన్నైనా తన పబ్లిసిటీకి వాడుకోగల ప్రచార చాతుర్యం రాంగోపాల్ వర్మలో పుష్కలంగా ఉంది.
ఈ పరిస్థితుల్లో తమ పార్టీ పరువును , తమ అధినేత ప్రతిష్టను బజారుకీడుస్తున్న రాంగోపాల్ వర్మ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి తెలుగుదేశం వర్గాలు.
[youtube_video videoid=xtnmRZ9_bzg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: