శివ నిర్వాణ దర్శకత్వంలో పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత భార్యాభర్తల్లాగ కనిపించనున్నారని.. వారిద్దరి మధ్య గొడవలెక్కువుంటాయని ఇప్పటికే నాగ చైతన్య చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ చిత్రంలో చైతు రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నట్టు సమాచారం. క్రికెటర్ గా కూడా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ రిలీజ్ చేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. ఆఫ్టర్ మ్యారేజ్, చైతు, సమంత కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మజిలీపై మంచి అంచనాలున్నాయి. మరి చూద్దాం ఆ అంచనాలను మజిలీ రీచ్ అవుతుందో లేదో?
శివ నిర్వాణ దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ మరోక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: