‘భలె భలె మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘నాయిగల్ జాగరతయ్’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నైజర్ షపీ ‘7’ అనే టైటిల్ తో ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెజీనా, నందిత శ్వేత, పూజిత పొన్నాడ, ఆర్య అదితి, అనీషా అంబ్రోస్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే.. ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ దక్కించుకున్నారు. కాగా నైజర్ షఫీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను రమేష్ వర్మ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఆర్ఎక్స్ 100 సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఇప్పటికే ఎన్నో థ్రిల్లర్ మూవీస్ వచ్చినా.. వస్తున్నా వాటికున్న క్రేజ్ వాటికే ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ అలరిస్తుందో చూద్దాం.
[youtube_video videoid=FnabE442Sj0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: