ఫాదర్ పాత్ర అయినా.. విలన్ అయినా.. అన్న అయినా.. డాన్ అయినా.. ఫ్రైండ్ అయినా.. పోలీస్ ఆఫీసర్ అయినా..ఒక్క పాత్ర అని కాదు..ఏ పాత్ర అయినా సరే అవలీలగా..అలవోకగా వంద కాదు కాదు.. రెండొందల శాతం పూర్తిగా నటించగలిగే విలక్షణ నటుడ ప్రకాష్ రాజ్. ఏ పాత్ర పోషించినా తన తరవాతే ఎవరైనా అనేంతలా నటించగలిగే సత్తా ఉన్న బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్. సినీ రంగంలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన సత్తా చాటడానికి వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి గత కొంతకాలంగా ప్రకాష్ రాజ్ దేశ రాజకీయాలపై మాట్లాడుతూనే ఉన్నారు. అంతేకాదు ‘జస్ట్ ఆస్కింగ్’ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై తన అభిప్రాయలను షేర్ చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రకాష్ రాజ్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మీ సపోర్ట్‌తో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఎక్కడి నుంచి అనే వివరాలు త్వరలో వెల్లడిస్తాను. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్‌రాజ్. ఇక ప్రకాష్ రాజ్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే హాట్ హాట్ గా చర్చ మొదలయింది. ప్రకాష్ రాజ్ సొంత రాష్ట్రం కర్ణాటక నుండే ఏదో ఒక నియోజకవర్గం నుంచి ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రకాష్ రాజ్ నుండే క్లారిటీ రావాలి.
[youtube_video videoid=l4k4fHjG1VI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: