ప్రముఖ నిర్మాత `దిల్` రాజు… దాదాపు అగ్ర హీరోలందరితోనూ సినిమాలను నిర్మించారు. ఈ కథానాయకులలో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. వీరిద్దరి తొలి కాంబినేషన్ మూవీ `మున్నా` ఆశించిన విజయం సాధించకపోయినా… రెండో చిత్రం `Mr. పర్‌ఫెక్ట్` బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలచింది. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత ఈ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే… కన్నడంలో రూపొంది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్బింగ్ అయిన `కేజీఎఫ్`… ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్… ప్రభాస్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాని `దిల్` రాజు నిర్మించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఈ ముగ్గురి మధ్య చర్చలు జరిగాయని కొన్ని కథనాలు వస్తున్నాయి. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గానీ… ఒకవేళ ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే మాత్రం 2020లో ఈ సినిమా తెరపైకి వచ్చే అవకాశముంది. చూద్దాం… ఏం జరుగుతుందో?
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=5UxSVyxSrcU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: