
ట్యాగ్ · 15 కథనాలు


వెంకీ తో జాతి రత్నాలు డైరెక్టర్?

'ఎఫ్ 3' క్లోజింగ్ కలెక్షన్స్..!

వచ్చే వారం “కభీ ఈద్ కభీ దివాలీ”సెట్స్ కు వెంకటేష్ ?

2022 లో మూడు ప్రాజెక్టులతో వెంకీ..!

వెంకీ 'అసురన్' రీమేక్ టైటిల్ 'నారప్ప'..?
ఆ రీమేక్ ని వదిలేసిన వెంకీ?
వెంకటేష్‌కి జోడీగా అనుష్క?
కాలాన్ని వెనక్కి తీసుకువెళ్ళిన `వెంకీమామ`

వెంకటేష్ చిత్రంలో బాలీవుడ్ నటుడు?

వెంకటేష్ ‘ధ్రువనక్షత్రం’కు 30 ఏళ్ళు

రకుల్ సినిమాను రీమేక్ చేయనున్న వెంకీ!

రానా నాయుడు- నెట్ ఫ్లిక్స్ కు వెంకీ ఫన్నీ వార్నింగ్
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా ఎంత నడుస్తుందో చూస్తున్నాం. అందుకే స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. చిత్రీకరణ కూడా పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఈసిరీస్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వెంకటేష్ సైంధవ్ ?
సీనియర్ హీరోలలో వెంకటేష్ ది సపరేట్ స్టైల్.. ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది.

వెంకీ తో జాతి రత్నాలు డైరెక్టర్?
అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా జాతిరత్నాలు. స్మాల్ బడ్జెట్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మంచి కలెక్షన్స్ ను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఈసినిమాతో డైరెక్టర్ అనుదీప్ క్రేజ్ కూడా బాాగా పెరిగింది. హీరోల సంగతి పక్కన పెడితే ఆయన ఇన్నోసెంట్ గా చేసే కామెడీ కి, కామెడీ టైమింగ్ కు అసలైన జాతిరత్నం తనే అంటూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తరువాత అనుదీప్ ఏకంగా తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా…

'ఎఫ్ 3' సక్సెస్.. అనిల్ రావిపూడి థ్యాంక్స్ నోట్..!
టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో ఇప్పటివరకూ ఫ్లాప్ అందుకోని డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో అనిల్ రావిపూడి పేరు కూడా ఉంటుంది. పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ ఆరు సినిమాలు చేశాడు. ఆరు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇటీవలే ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 తీసి మంచి హిట్ ను అందుకున్నాడు. ఈసినిమా రిలీజ్ కు చాలా టైమ్ పట్టింది. ఎప్పుడో ఈసీక్వెల్ సెట్స్ పైకి వెళ్లినా ఆతరువాత కరోనా వల్ల కొద్ది రోజులు లేట్ అవ్వడం.. తరువాత యూనిట్ సభ్యులే కరోనాకు గురవ్వడం.. ఇలా పలుమార్లు బ్రేకులు పడ్డాయి. ఇక రిలీజ్ సమయంలో కూడా చాలా సార్లు వాయిదా పడింది…

'ఎఫ్ 3' క్లోజింగ్ కలెక్షన్స్..!
టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎఫ్3. ఈసినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ గా తెరకెక్కించాడు అనిల్. ఇక ఈసినిమా కూడా ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఫైనల్ గా సమ్మర్ సోగాళ్లుగా మే27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కరోనా తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమైన తరుణంలో ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం థియేటర్లకు రప్పించింది. కామెడీతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది చిత్రయూనిట్.

వచ్చే వారం “కభీ ఈద్ కభీ దివాలీ”సెట్స్ కు వెంకటేష్ ?
తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోలు, హిందీ సినిమాలలో టాలీవుడ్ హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు "గాడ్ ఫాదర్" మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించారు. అమీర్ "లాల్ సింగ్ చద్దా" మూవీ లో నాగచైతన్య నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ "F 2" మూవీ సీక్వెల్ "F 3 " మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర కై ఎంపిక అయ్యారు.

2022 లో మూడు ప్రాజెక్టులతో వెంకీ..!
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్ర హీరోలు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో వెంకీ ఇంకా సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. ఇప్పటికే వెంకీ ఈ ఏడాది మూడు సినిమాలతో సిద్దంగా ఉన్నాడు. అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమా.. ఇంకా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న నారప్ప, ఇంకా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న దృశ్యం2 సినిమా. ఈ మూడు సినిమాల్లో ఇప్పటికే రెండు సినిమాలు నారప్ప, దృశ్యం 2 రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఎఫ్3 సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే ఈసినిమా కూడా దాదాపు ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

వెంకీ 'అసురన్' రీమేక్ టైటిల్ 'నారప్ప'..?
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో 'అసురన్' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను 'అనంతపురం'లో చిత్రీకరిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు.
ఆ రీమేక్ ని వదిలేసిన వెంకీ?
విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం `వెంకీమామ`... తన బర్త్ డే స్పెషల్ గా డిసెంబర్ 13న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తమిళ బ్లాక్ బస్టర్ `అసురన్` రీమేక్ లో నటించబోతున్నారు ఈ సీనియర్ హీరో. ఇందులో రెండు ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నారు వెంకీ. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్... జనవరిలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ తరువాత యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబోలో హార్స్ రేస్ క్లబ్ నేపథ్యంలో వెంకీ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తారని టాక్.
వెంకటేష్‌కి జోడీగా అనుష్క?
తమిళనాట ఘనవిజయం సాధించిన `అసురన్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్‌ని డైరెక్ట్ చేస్తాడని ప్రచారం సాగుతోంది. కాగా... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకీకి జోడీగా అనుష్క నటించే అవకాశముందని టాక్. వాస్తవానికి, ఈ పాత్ర కోసం ఇదివరకు శ్రియ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, అనుష్క ఆ పాత్రలో నటిస్తుందని సమాచారం. అభినయానికి అవకాశమున్న డీ-గ్లామర్ రోల్ కావడంతో స్వీటీ కూడా ఆసక్తి చూపిస్తుందని…
కాలాన్ని వెనక్కి తీసుకువెళ్ళిన `వెంకీమామ`
కథానాయకుడిగా తన ప్రయాణాన్ని ఎప్పుడైతే మొదలుపెట్టారో... అటుఇటుగా అదే సమయానికి ప్రేక్షకులను కూడా తీసుకెళ్ళబోతున్నారు విక్టరీ వెంకటేష్. సరిగ్గా చెప్పాలంటే... కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళి మరీ వినోదాలు పంచనున్నారు. అయితే, ఇదంతా `వెంకీమామ` చిత్రంలోని పాట కోసమే సుమా. `వింటేజ్ వెంకీ`ని గుర్తుచేసేలా డిజైన్ చేసిన ఈ రెట్రో నంబర్... వెంకీ ఫ్యాన్స్‌నే కాదు కామన్ ఆడియన్స్‌ని కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటుందని టాక్.

వెంకటేష్ చిత్రంలో బాలీవుడ్ నటుడు?
‘విక్టరీ’ వెంకటేష్, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `హార్స్ క్లబ్` బ్యాక్ డ్రాప్‌తో సాగే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్... ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఇందులో ఓ శక్తిమంతమైన పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీని ఎంపిక చేసే దిశగా తరుణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వెంకటేష్ ‘ధ్రువనక్షత్రం’కు 30 ఏళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్ కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ధ్రువనక్షత్రం’ ఒకటి. వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.అశోక్ కుమార్ నిర్మించారు. వెంకటేష్ సరసన రజిని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ‘ఊర్వశి’ శారద, భానుచందర్, రోహిణి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, శివకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

రకుల్ సినిమాను రీమేక్ చేయనున్న వెంకీ!
తెలుగులో హిట్ అయిన సినిమాను హిందీలో.. హిందీలో హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడం ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. ఇప్పుడు తాజాగా మరో హిందీ సినిమా రీమేక్ అవ్వనుంది. అజయ్ దేవగణ్, రకుల్,టబు హీరోహీరోయిన్లుగా నటించిన దే దే ప్యార్ దే సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈసినిమా అక్కడ. భార్యను వదిలేసి యంగ్ లేడీ ప్రేమలో పడ్డ మిడిల్ ఏజ్ మెన్ గా అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో నటించాడు. ఇక రకుల్ కు కూడా ఈసినిమాతో బాలీవుడ్ లో హిట్ దొరికింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

వెంకీకి మరోసారి కలిసొచ్చిన సంక్రాంతి `ఫస్ట్ టైమ్` సెంటిమెంట్
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కి, సంక్రాంతికి విడదీయరాని అనుబంధముంది. ఈ సీజన్‌లో... ఆయన నటించిన 16 చిత్రాలు (తాజా చిత్రం `ఎఫ్ 2`తో కలుపుకుని) విడుదల కాగా.. వాటిలో 6 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసాయి. ఆ చిత్రాలే `శత్రువు`, `చంటి`, `కలిసుందాం...రా!`, `లక్ష్మీ`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `ఎఫ్ 2`. అయితే... ఈ ఆరు చిత్రాలకు సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే... ఈ ఆరు సినిమాల్లో నటించిన హీరోయిన్‌లంతా వెంకీతో కలసి తొలిసారిగా వెండితెరపై సందడి చేసిన వారే కావడం విశేషం.