‘ఎఫ్ 3’ క్లోజింగ్ కలెక్షన్స్..!

F3 Movie Closing Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Collections,F3 Movie Closing Collections,F3 Movie Latest Updates,F3 Telugu Movie Closing Collections, Venkatesh and Varun Tej Multi Starrer Movie F3 Closing Collections Updates,F3 Movie latest Closing Collections Updates,Venkatesh F3 Movie Collections, Varun Tej F3 Movie Collections Updates,Varun Tej Upcoming Movies,Venkatesh Upcoming Movies,Venkatesh New Movie Updates,Venkatesh New Movie,Venkatesh latest Movie Updates

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎఫ్3. ఈసినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ గా తెరకెక్కించాడు అనిల్. ఇక ఈసినిమా కూడా ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఫైనల్ గా సమ్మర్ సోగాళ్లుగా మే27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కరోనా తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమైన తరుణంలో ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం థియేటర్లకు రప్పించింది. కామెడీతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ అయి 40 రోజులు అవుతుంది. ఇప్పటికే సాలిడ్ కలెక్షన్స్ అందుకొని లాభాలు అందించిన ఈసినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.. నైజాంలో ఈ సినిమా 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 54 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. అలానే ప్రపంచవ్యాప్తంగా 70.94 కోట్ల షేర్ తో రూ. 134 కోట్లు షేర్ వసూలు చేసింది.

కాగా ఈసినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహాన్, సునీల్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈసినిమాను నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + thirteen =