ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉండగా అందులో తన దర్శకత్వంలో వస్తున్న రాయన్ సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. తలవంచి ఎరుగడే, పీచు మిఠాయి అంటూ వచ్చే రెండు పాటలను రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జులై 26వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























