మహారాజ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

Vijay Sethupathi's Maharaja Release Trailer Out Now

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగానే కాకుండా విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. క్యారక్టర్ నచ్చితే అది ఎలాంటిదైనా సరే నటించడానికి సంసిద్ధంగా ఉంటాడు. తెలుగులో ఆయన ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్‌లో ‘జవాన్,’ ‘ఫర్జీ,’ మరియు ‘మెర్రీ క్రిస్ట్‌మన్’ తదితర చిత్రాలలో నటించి పాన్ ఇండియా స్థాయిలో ప్రసిద్ధి చెందాడు. ఇదే కోవలో ఈ టాలెంటెడ్‌ యాక్టర్ ఇప్పుడు మరో విభిన్న చిత్రంలో నటించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ సేతుపతి తాజాగా ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. కాగా ఇది విజయ్ సేతుపతి నటిస్తున్న 50వ చిత్రం కావడం విశేషం. ‘కురంగు బొమ్మై’ ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దర్శక,నిర్మాత అనురాగ్ కశ్యప్‌, మమతా మోహన్‌ దాస్‌, నట్టీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘మహారాజ’ జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్‌ సహా ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఈ కొత్త ట్రైలర్ కూడా ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటిలాగే మక్కళ్‌ సెల్వన్‌ తనదైన నటనతో అదరగొట్టాడు. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.