ప్రభాస్ కల్కి 2898 ఏడి నుండి ట్రైలర్ వచ్చేసింది.ఈ ట్రైలర్ కు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.స్టన్నింగ్ విజువల్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.నాగ్ అశ్విన్ సృష్టించిన మరో ప్రపంచం బిగ్ స్క్రీన్ మీద రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.ట్రైలర్ లో ప్రభాస్, దీపికా, అమితాబ్ తోపాటు చివర్లో కమల్ హాసన్ ను కూడా చూపెట్టారు.కమల్ గెటప్ అయితే గుర్తుపట్టలేనట్లుగా వుంది. ఎవరికి వారే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు.ఇలా చాలా సప్రైజ్ లతో వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను డబుల్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా రిలీజ్ కు ఇంకా మూడు వారాల కు పైగా సమయం ఉండగానే ట్రైలర్ ను వదిలారు.దాంతో రిలీజ్ సమయానికి బజ్ తగ్గకుండా ఉండడం కోసం మరో ట్రైలర్ ను కూడా విడుదలచేయాలనే ఆలోచనలో వున్నారు మేకర్స్.అందుకే సేఫ్ సైడ్ సెకండ్ ట్రైలర్ ను కూడా కట్ చేసి పెట్టుకున్నారు.దీనికి సెన్సార్ కూడా జరిగిపోయింది.రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందు ఈ ట్రైలర్ ను వదిలే ఛాన్స్ వుంది.
అంతేకాదు ప్రమోషన్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న కల్కిని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు 500కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు.ఈనెల 27న ఈసినిమా భారీ స్థాయిలో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























