పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ముందుగా ప్రకటించినట్లు సోమవారం రాత్రి కల్కి ట్రైలర్ రిలీజ్ చేసింది. ఊహించినట్లే ఈ సినిమా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. ప్రభాస్ అభిమానులకే కాకుండా సినీ ప్రియులు అందరికీ కల్కి ట్రైలర్ తెగ నచ్చేసింది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక ఈ సందర్భంగా కల్కి 2898 ఏడీ ట్రైలర్ హైలైట్స్ ఒకసారి పరిశీలిద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కల్కి 2898 ఏడీ ట్రైలర్ హైలైట్స్
- కల్కి 2898 ఏడీ ప్రేక్షకులను నిజంగానే ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది.
- ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై చూడని విధంగా విజువల్స్ కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి.
- మహాభారత కాలం నాటి సెట్టింగ్స్ మరియు భవిష్యత్తు కాలంలో భూమి ఎలా ఉండనుంది అనేది తెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించారు.
- ‘అశ్వత్థామ’ పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సూట్ అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.
- బిగ్ బీ యాక్షన్ సీక్వెన్స్ చూసి థియేటర్లలో ఆడియెన్స్ థ్రిల్ అవడం పక్కా.
- ఇక భైరవగా రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ అదుర్స్.
- ‘రికార్డ్స్ చూసుకో.. ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు’ అంటూప్రభాస్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‍గా నిలిచింది.
- మేకర్స్ చెప్పినట్లుగానే భైరవ ఉపయోగించే కారు ‘బుజ్జి’ సినిమాలో కీలక రోల్ ప్లే చేయనుంది.
- దీపికా పదుకొణే, దిశా పటాని డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి ఆశ్చర్యపరిచారు.
- అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, కమల్ హాసన్ వారి పాత్రలకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
- ట్రైలర్ చివరిలో లోకనాయకుడు కమల్ హాసన్ స్పెషల్ అప్పీయరెన్స్ అద్భుతం.
- కమల్ గెటప్ భయానకంగా ఉంది. ఆయన విలన్ పాత్ర పోషించనున్నట్లు అర్ధమవుతుంది.
- ఆయన చెప్పిన ‘భయపడకు మరో ప్రపంచం వస్తుంది’ అనే డైలాగ్ తోనే ట్రైలర్ ఎండ్ అయింది.
- ఇది గమనిస్తే.. కల్కి సీక్వెల్ గురించి లీడ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























