మిస్టర్ బచ్చన్ త్వరలో రిలీజ్ డేట్

mr bachchan movie ravi teja release date update

రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ఈగల్. ఈసినిమా అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా రవితేజ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా. ఈసినిమా హిందీలో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ అంటున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇదిలా ఉండగా తాజాాగా ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా వినిపిస్తుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను చిత్రయూనిట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి. మరి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కు ఈసినిమా అయినా మంచి హిట్ ను అందిస్తుందేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.