కెరీర్ ప్రారంభం నుంచీ తనదైన చిత్రాలతో అలరిస్తూ వస్తున్నాడు శర్వానంద్. ఇక రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా మొత్తం చిన్న పిల్లాడి చుట్టూనే తిరుగుతుంది. ఈనేపథ్యంలోనే శర్వానంద్, కృతి శెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు, శర్వానంద్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ కంటెంట్ ఇలా అన్నీ సినిమా హిట్ లో ప్రధాన భాగమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఈనేపథ్యంలోనే మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 13.87 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా అధికారికంగా తెలియచేసింది. మరి మూడు రోజుల్లో 13 కోట్ల షేర్ అంటే డీసెంట్ కలెక్షన్స్ నే రాబట్టుకుందని చెప్పొచ్చు.
కాగా ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్, సుదర్శన్ పలు కీలక పాత్రల్లో కనిపించారు చేశారు. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. హేషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: