చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. స్పెషల్ గెస్ట్‌గా మెగాస్టార్‌

Megastar Chiranjeevi Invited For AP CM Chandrababu Oath Taking Ceremony

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాగా విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఒక పర్యాయం ఐదేళ్లు పరిపాలించిన ఆయన ఇప్పుడు రెండోసారి సీఎం పదవిని అలంకరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గన్నవరం ఎయిర్‌ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కులోని సుమారు 11 ఎకరాలు స్థలంలో భారీ బహిరంగ వేదికపై ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగనుంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రుల, ఇంకా బీజేపీ పాలిట రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ అగ్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. కాగా చంద్రబాబుకి, చిరంజీవికి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే!

అలాగే ఎన్డీయే కూటమిలో చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవిని విశిష్ట అతిథి(స్టేట్‌ స్పెషల్ గెస్ట్‌)గా ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో చిరంజీవి మంగళవారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్నారు. రేపు ఉదయం 11:27 ని.లకు జరిగే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక ఆయనతో పాటుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరికొందరు ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.